ముంబయి(Mumbai) ఇండియన్స్.. తన నాలుగో మ్యాచ్ లోనూ సత్తా చూపి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Bangalore)ను ఓడించింది. నాలుగింట్లో మూడింటిని గెలిచి ఇప్పటికైతే పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. టాస్ గెలిచి తొలుత బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ముంబయి.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. బెంగళూరు 6 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని(Small Target)ను ముంబయి టీమ్… ఆడుతూ పాడుతూ ఛేదించింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.1 ఓవర్లలో 133 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
బెంగళూరు టపటపా…
ఓపెనర్లు స్మృతి మంధాన(9), సోఫీ డివైన్(9) తక్కువ స్కోరుకే(Low Score) ఔటయ్యారు. సబ్బినేని మేఘన(11) చేస్తే.. ఎలిసా పెర్రీ(44 నాటౌట్)కు అండగా నిలిచేవారే కరవయ్యారు. రిచా ఘోష్(7), జార్జియా వేరమ్(27) పరుగులు చేశారు.
ముంబయి సూపర్…
అటు బెంగళూరు ఓపెనర్లు పూర్తిగా విఫల(Failure)మైతే ఇటు ముంబయి ఓపెనర్లు మాత్రం తొలి బాల్ నుంచే దడదడలాడించారు. యాస్తిక భాటియా(31), హేలీ మాథ్యూస్(26), నాట్ సీవర్ బ్రంట్(27), అమేలియా కెర్(36) అంతా తలో చేయి వేయడంతో ముంబయి ఘన విజయం దిశగా దూసుకెళ్లింది.