మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన భారత్ రాష్ట్ర సమితి(BRS)… రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చూపించాలని భావిస్తున్నది. అందులో భాగంగానే తమ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సెలక్షన్ పై పార్టీ నేతలతో అధ్యక్షుడు KCR సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో చర్చించిన పార్టీ చీఫ్… ఆ స్థానాల్లో మాత్రం పాతవారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
నియోజకవర్గాలు – అభ్యర్థులు ఇలా…
ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
కరీంనగర్ – వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్