త్వరలో జరిగే లోక్ సభ(Loksabha) ఎన్నికల కోసం నిన్న(మార్చి 4న) నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి(BRS) ఈ రోజు మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి పోటీకి దిగే క్యాండిడేట్ పై క్లారిటీ ఇచ్చింది. మన్నె శ్రీనివాస్ రెడ్డినే పాలమూరు నుంచి పోటీకి దిగనున్నారు. నియోజకవర్గ(Constituency) లీడర్లతో సమావేశం నిర్వహించిన పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు… తొలుత మహబూబ్ నగర్ అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశారు.. ఇక నాగర్ కర్నూల్ సెగ్మెంట్ కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు గాను నాగర్ కర్నూల్ అభ్యర్థిని సైతం ఫైనలైజ్ చేశారు. ఈ నియోజకవర్గ నేతలతోనూ మాజీ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అతికొద్దిసేపట్లోనే రెండో వ్యక్తిని సైతం పోటీదారుగా తెలియజేస్తారు. నిన్న కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశారు.