ఫస్ట్ టెస్ట్ లో ఓడినా వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి సిరీస్(Series) సాధించిన టీమ్ఇండియా.. చివరిదైన(Last) ఐదో టెస్టులోనూ విజృంభిస్తున్నది. బ్యాటింగ్ వైఫల్యంతో గత మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ లోనూ అదే తీరు చూపించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయ చేయడంతో టాప్ ఆర్డర్ కూలిపోయింది. ఓపెనర్ జాక్ క్రాలీ మినహా ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడాలన్న ప్రయత్నం చేయలేదు. దీంతో బెన్ స్టోక్స్ సేన 218 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతా స్పిన్నర్లకే…
ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ టీమ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలీ(79), బెన్ డకెట్(27), ఒలీ పోప్(11), జో రూట్(26), జానీ బెయిర్ స్టో(29), కెప్టెన్ బెన్ స్టోక్స్(0) వికెట్లు చేజార్చుకున్నారు. బెన్ ఫోక్స్(24) కొద్దిసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఆ పప్పులు ఉడకనీయలేదు రవిచంద్రన్ అశ్విన్. 3 వికెట్లకు 137 రన్స్ తో పటిష్ఠంగా కనిపించిన ఇంగ్లిష్ టీమ్.. 183కు చేరుకునేసరికి 8 వికెట్లు సమర్పించుకుంది. కుల్దీప్ 5, అశ్విన్ 4, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.