రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే 9 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించిన కమలం పార్టీ(BJP) మిగతా క్యాండిడేట్స్ కోసం చర్చలు షురూ చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థిత్వాల(Candidatures)ను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 2న దేశవ్యాప్తంగా 195 మందితో లిస్టు ప్రకటిస్తే అందులో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది ఉన్నారు.
కిషన్ రెడ్డికి పిలుపు…
ఇదే విషయమై ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో చర్చలు జరపాలని నిర్ణయించిన పార్టీ హైకమాండ్(High Command).. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సైతం ఉన్నట్టుండి హస్తిన(Delhi)కి రావాలని చెప్పింది. దీంతో కిషన్ రెడ్డి తన ప్రోగ్రామ్స్ అన్నీ రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరారు. కిషన్ రెడ్డితోపాటు BJP రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సైతం ఈ మీటింగ్ కు అటెండ్ అవుతున్నారు. రేపు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతుండగా.. ఈ ఇద్దరూ ఆ మీటింగ్ కు వెళ్తున్నారు.