ఎన్నికల ప్రచారం(Election Campaign)లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని రేవంత్ సర్కారు ప్రారంభించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి(Assembly Constituency)కి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పూజల అనంతరం అగ్రికల్చర్ మార్కెట్ గ్రౌండ్ లో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
భారీగా నిధులు అవసరం…
ఈ కార్యక్రమానికి భారీగా నిధులు అవసరమవుతున్నాయి. నాలుగున్నర లక్షల ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కావాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 92 రోజులకు ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని మొదలుపెట్టింది. తొలి దశ(First Phase) నిర్మాణాల కోసం రూ.3,000 కోట్ల రుణం(Loan) తీసుకోవాలంటూ హౌజింగ్ బోర్డు(Housing Board)కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది.
అన్ని రకాలుగా…
400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఒక్కో ఇల్లు కట్టివ్వబోతున్నారు. ఒక్కో ఇంటిలో హాలు(Hall), బెడ్ రూమ్, వంట గది(Kitchen), స్నానాల గది(Bathroom) తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఇళ్లను మహిళల పేరు మీదే ఇవ్వాలని.. ఇంటి యజమాని అయిన ఆమె పేరు మీదే ఉండనుందని సర్కారు క్లారిటీ ఇచ్చింది.