
విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న క్షేత్రం… భక్తజన సంద్రాన్ని తలపించింది. గిరి ప్రదక్షిణకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి సేవలో పాల్గొన్నారు. ఆషాఢ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి పౌర్ణమి సమయంలో ముగింపు చేయడం ఆనవాయితీ. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ అంతకుమించి రావడంతో సింహాచలం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అప్పన్న నామస్మరణతో మారుమోగాయి.
32 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణ ముగిసేందుకు ఆరు నుంచి 10 గంటలు పడుతుంది. నిండు చందమామను పోలిన రీతిలో స్వామి స్వరూపాన్ని దర్శించి తరించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.