వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు(Double Centuries)… ఐదు టెస్టుల సిరీస్ లో 700కు పైగా పరుగులు. ఊహించని రీతిలో ప్రత్యర్థికి షాక్ ఇస్తూ భారత్ ను సిరీస్ విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర.. అందుకే అతడికి ఐసీసీ అవార్డు దక్కింది. ఆ యువ సంచలన క్రికెటరే యశస్వి జైస్వాల్. మొన్నటి ఇంగ్లండ్ సిరీస్ లో యశస్వి ఎలా ఆడాడో కళ్లారా చూశాం. ఇలా టెస్టుల్లో అరంగేట్రం(Entry) చేసిన అతి కొద్ది కాలంలోనే ఈ అవార్డు అందుకోవడం ఈ చిన్నోడి ప్రతిభకు నిదర్శనం(Example).
ఇద్దరిని దాటి మరీ…
ప్రతి నెలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఆటగాళ్ల(Players)కు అవార్డును ఐసీసీ అందజేస్తుంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి నెలకు గాను జైస్వాల్ ను బెస్ట్ ప్లేయర్ గా ఎంపిక చేసింది. దీనికి మరో ఇద్దరు ఆటగాళ్లు పోటీపడ్డా.. వారిద్దరిని మించి పరుగులు చేయడంతో ఈ కుర్రోడి పేరునే ICC ప్రకటించింది. శ్రీలంక క్రికెటర్ పథుమ్ నిశాంక, న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ను అధిగమించి ‘ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్’ను అందుకున్నాడు యశస్వి.
తొమ్మిది టెస్టుల్లోనే…
ఇప్పటివరకు తన కెరీర్లో కేవలం తొమ్మిది టెస్టులాడిన యశస్వి.. మూడు సెంచరీలు(రెండు డబుల్), 4 హాఫ్ సెంచరీలతో 1,028 రన్స్ చేశాడు. హయ్యెస్ట్ స్కోరు 214 నాటౌట్ కాగా అతడి యావరేజ్ 68.53గా ఉంది.