డీఎస్సీ(DSC) కన్నా ముందే టెట్(TET) నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో విద్యాశాఖ.. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఆన్ లైన్(Online) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
డేట్స్ ఇవే…
ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన విద్యాశాఖ… మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఎక్కువ మంది డీఎస్సీ రాసేలా దానికి ముందే టెట్ ను నిర్వహించాలని అంతకు అరగంట ముందే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే ప్రకటించిన DSCని టెట్ తర్వాతే జరపాలని నిశ్చయించి విద్యాశాఖకు ఆదేశాలు(Orders) జారీ అయిన వెంటనే.. టెట్-2024 షెడ్యూల్ రిలీజయింది.