ఆరు గ్యారంటీల్లో మెజారిటీ పథకాల(Schemes)ను మహిళల పేరిట అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… స్వయం సహాయక సంఘాల(Self Help Groups) సభ్యులకు మరో నజరానా ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను, విద్యార్థుల యూనిఫామ్స్ తయారీ బాధ్యతల్ని కట్టబెట్టిన సర్కారు.. రుణాల విషయంలోనూ వారికి పెద్దపీట వేసింది. ఇప్పుడు సంఘాల సభ్యులందరికీ ఏకంగా రూ.10 లక్షల బీమా కల్పిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
నిధులు రిలీజ్…
స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కోసం స్త్రీ నిధి ఫెడరేషన్ కు రూ.50.41 కోట్లు విడుదల చేసింది. తద్వారా రూ.2 లక్షల మేర రుణాలకు రిస్క్ కవరేజ్ అందనుంది. ప్రముఖ బీమా సంస్థ(Insurance Company) నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయాలని స్త్రీ నిధి ఫెడరేషన్ కు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే మహాలక్ష్మీ కింద RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించగా, అటు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని గృహ యజమాని అయిన మహిళ పేరు మీదే ఇవ్వాలని సర్కారు డిసైడ్ అయింది. వీటితోపాటు ఇప్పుడు మహిళా సంఘాల సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తూ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.