రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గత పదేళ్లుగా తోడుగా నిలిచిన ఆశావహులకు భారీస్థాయిలో నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. MLA టికెట్ ఆశించి దక్కనివారు, వివిధ స్థాయిల్లో కీలక నేతలకు అండగా నిలిచినవారు, కావాలని తమ సీటును త్యాగం చేసి పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వారికి ఈ పోస్టులు కట్టబెడుతూ సర్కారు ఆర్డర్స్ ఇచ్చింది.
ఆయనకే టూరిజం…
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ప్రతిసారీ ప్రధాన పోటీదారుగా భావిస్తూ టికెట్ నిరాకరణకు గురైన పటేల్ రమేశ్ రెడ్డికి పర్యాటక అభివృద్ధి శాఖ(Tourism Development Corporation) దక్కింది. ఈయన మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డితో తీవ్రంగా పోటీపడ్డా చివరకు హైకమాండ్ రమేశ్ రెడ్డిని బుజ్జగించి దామోదర్ కే సీటు ఇచ్చింది. అయినా అక్కడ ఆయన ఓడిపోయి BRS అభ్యర్థిగా మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. రమేశ్ రెడ్డికి నల్గొండ MP టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినా… చివరకు ఆయనకు కీలక నామినేటెడ్ పదవి దక్కినట్లయింది.
పలువురికి ఇలా…
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు కె.శివసేనారెడ్డి, BC ఫైనాన్స్ కార్పొరేషన్ ను నూతి శ్రీకాంత్ కు, SC కార్పొరేషన్ ను ఎన్.ప్రీతమ్ కు, మహిళా కమిషన్ ను నేరెళ్ల శారదకు, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ను పి.గుర్నాథ్ రెడ్డికి, మానాల మోహన్ రెడ్డికి కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, ఎం.వీరయ్యకు వికలాంగుల కార్పొరేషన్ ను కట్టబెడుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.