జపాన్(Japan) సెంట్రల్ బ్యాంకు 17 ఏళ్ల తర్వాత రేట్లు పెంచడం.. TCS, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. 736 పాయింట్ల నష్టంతో 72,012 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిస్తే… 238 పాయింట్ల నష్టంతో 21,817 పాయింట్ల వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. BSE సెన్సెక్స్ 1.01 శాతం క్షీణించి 736.37 పాయింట్లు కోల్పోయి ఒక నెల కనిష్ఠ స్థాయి 72,012.05 వద్ద స్థిరపడింది.
షేర్లు ఇలా…
30 షేర్ల BSE సెన్సెక్స్ లో 23 షేర్లు నష్టాల బాటలో నడిస్తే, 7 షేర్లు మాత్రం లాభాలు సాధించాయి. డే ట్రేడ్ లో ఇండెక్స్ 815.07 పాయింట్లతో 1.12 శాతం క్షీణించి 72,000 దిగువకు జారి చివరకు 71,933.35 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ(Nifty) సైతం 238.25 పాయింట్లు కోల్పోయి 1.08 శాతం మేర క్షీణతకు గురై నెల రోజుల కనిష్ఠ స్థాయి 21,817.45 పాయింట్ల వద్ద ముగిసింది. 50 నిఫ్టీ షేర్లకు గాను 41 నష్టాల్లో ముగియగా, తొమ్మిది మాత్రం లాభాల్లో కొనసాగాయి.