ఓటీటీ… ప్రస్తుత రోజుల్లో దీనికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. థియేటర్ల(Theatres)లో సినిమాలు ఆడుతున్నాయో లేదో కానీ OTTల్లో మాత్రం దుమ్ముదులుపుతున్నాయి. సినిమా హాళ్లలో పెద్దగా రెస్పాన్స్ రాని మూవీలు సైతం OTT ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తూ భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాత కొద్ది రోజులు తెరలపై ప్రదర్శించిన అనంతరమే వాటిని ఓటీటీల్లోకి రిలీజ్ చేసేవారు. కానీ కాలం మారింది. క్రమంగా అవి రిలీజ్ కాకముందే ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తున్నాయో తెలిసిపోతున్నది.
షూటింగ్ లో ఉండగానే…
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు(Movies) ఎప్పుడు OTTల్లోకి రాబోతున్నాయో ముందే ప్రకటిస్తున్నాయి ఆయా సంస్థలు. తాజాగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime) సైతం తన ప్లాట్ ఫామ్ లోని మూవీలను ప్రకటించింది. క్రిష్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న’హరిహర వీరమల్లు’… రిషబ్ షెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘కాంతార-చాప్టర్1’.. సూర్య నటిస్తున్న ‘కంగువా’… శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్, కియారా అద్వాణీ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’… నితిన్ ‘తమ్ముడు’ వంటి సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబోతున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలు OTT ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి.