ఐపీఎల్ చరిత్రలో ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ నమోదైంది. 20 ఓవర్ల పొట్టి ఫార్మాట్ లో 277 పరుగుల స్కోరు రికార్డయింది. ఈ రికార్డును సొంతగడ్డపై హైదరాబాద్ సన్ రైజర్స్ క్రియేట్ చేసింది. దీంతో IPL చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్ గా సరికొత్త రికార్డు(Sensational Record) సృష్టించింది. బాల్ కింది నుంచి వెళ్తే ఫోర్.. పై నుంచి వెళ్తే సిక్స్ అన్నట్లుగా సాగింది హైదరాబాద్ బ్యాటర్లు దుమారం.
టాస్ ఓడి…
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(11) ఒక్కడే తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన సునామీ. ట్రావిస్ హెడ్(62; 24 బంతుల్లో 9×4, 3×6), అభిషేక్ శర్మ(63; 23 బంతుల్లో 3×4, 7×6), మార్ క్రమ్(42; 28 బంతుల్లో 2×4, 1×6), క్లాసెన్(80 నాటౌట్; 34 బంతుల్లో 4×4, 7×6) దడదడలాడించారు. ఈ మ్యాచ్ లో మొత్తం 18 సిక్స్ లు, 19 ఫోర్లు నమోదయ్యాయంటే ఎంత స్పీడ్ గా బ్యాటింగ్ సాగిందో అర్థం చేసుకోవచ్చు.