భారత్ రాష్ట్ర సమితి(BRS). తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నుంచి BRSగా మారాక ఇక తమది జాతీయ పార్టీ(National Party) అని సగర్వంగా చెప్పుకున్నారు లీడర్లు. అధినేత కన్నుపెడితే చాలు.. తమ జీవితాలు మారినట్లేనని అనుకున్నారు. ఇక MLAనో, MP టికెట్ వచ్చిందంటే వంద శాతం గెలిచినట్లేనని ధీమాగా ఉండేవారు. కానీ అధికారం పోవడం ఆలస్యం.. అంతా తలకిందులైంది. మొన్నటిదాకా టికెట్ ఇస్తే చాలనుకున్న తీరు నుంచి ఇప్పుడు టికెట్ ఇచ్చినా పోటీ చేయబోం అంట పార్టీ ఫిరాయిస్తున్నారు.
తండ్రులు, వారసులు…
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసి పార్టీలో మంచి గౌరవం పొందిన కె.కేశవరావు.. BRS రాజ్యసభ సభ్యుడిగా, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ GHMC మేయర్ గా పదవులు పొందారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముందునుంచీ హస్తం పార్టీలోనే ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కేకే.. తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయంటూ ఆయన కూతురు విజయలక్ష్మీ చెప్పడం ఇందుకు ఎగ్జాంపుల్(Example).
మరో సీనియర్ సైతం…
అధికారం(Power) కోల్పోయిన తర్వాత తమ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న సీనియర్ కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈయన కుమార్తె కావ్యను వరంగల్ MP అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను పోటీ చేయట్లేదంటూ పార్టీకి ఆమె రాజీనామా లెటర్ పంపించారు. ఇప్పుడు ఆమె తండ్రి శ్రీహరి సైతం పార్టీని వీడుతున్నారన్న ప్రచారంతో BRSకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాము గట్టిగా దృష్టిపెడితే మీ పార్టీలో ఒక్కరూ మిగలరు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతూనే ఉన్నాయి.