ఓపెనర్ విరాట్ కోహ్లి(Vira Kohli) చెలరేగినా అండగా నిలిచేవారు లేక బెంగళూరుకు పరాజయం తప్పలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ కోహ్లి ఒంటరిపోరాటంతో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్.. వీరవిహారంతో విజయాన్ని సులువు(Easy) చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్.. బ్యాటర్ల వీరవిహారంతో విజయాన్ని సులువు(Easy) చేసుకుంది. 16.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
కోహ్లి ఆడినా…
కోహ్లి(83; 59 బంతుల్లో 4×4, 4×6) ఒక ఎండ్ లో పాతుకుపోతే.. మరో ఎండ్ లో బ్యాటర్లు తక్కువ స్కోర్లకే క్యూ కట్టారు. డుప్లెసిస్(8) జట్టు స్కోరు 17 వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్(33), మాక్స్ వెల్(28) కొద్దిసేపు నిలబడే ప్రయత్నం చేశారు. రజత్ పటీదార్(3), అనూజ్ రావత్(3), దినేశ్ కార్తీక్(20) స్కోర్లు చేశారు.
కోల్ కతా ఘనంగా…
ఇక కోల్ కతా బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్ లా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 3.3 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరుగుల మార్క్ ను అందుకుంది. ఇలా ఓవర్ కు 12కు పైగానే రన్ రేట్ ను సాధించింది. ఓపెనర్లు సునీల్ నరైన్(47; 22 బంతుల్లో 2×4, 5×6), ఫిల్ సాల్ట్(30; 20 బంతుల్లో 2×4, 2×6) రాణిస్తే… ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్(50; 30 బంతుల్లో 3×4, 4×6) దుమ్ముదులిపాడు.