ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మెరవడంతో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మంచి స్కోరే చేసింది. టాస్ గెలిచి(Won The Toss) బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్ నవూ.. ఒకవైపు డికాక్(54; 38 బంతుల్లో 5×4, 2×6) హిట్టింగ్ చేస్తున్నా మరో ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేఎల్ రాహుల్(15), దేవ్ దత్ పడిక్కల్(9), మార్కస్ స్టాయినిస్(19) తక్కువ స్కోరుకే వికెట్లు చేజార్చుకున్నారు. కానీ కెప్టెన్ పూరన్(42; 21 బంతుల్లో 3×4, 3×6) క్రీజులో కుదురుకోవడంతో ఆ టీమ్ పరుగుల వేగం పెరిగింది.
సూపర్ బాల్ తో బోల్తా…
200 స్ట్రైక్ రేట్(Strike Rate)తో ధాటిగా సాగుతున్న నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న దశలో… కగిసో రబాడ్ అద్భుతమైన బాల్ తో అతణ్ని బోల్తా కొట్టించాడు. వైడ్ దిశగా వెళ్తున్న బాల్ ను పెద్ద షాట్ కు యత్నించినా అది ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను పడగొట్టింది. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని, కృణాల్ పాండ్య నిలకడగా ఆడటంతో లఖ్ నవూ మెరుగైన(Best) స్కోరు చేసింది.
చెలరేగిన కృణాల్…
పూరన్ దే విధ్వంసమంటే ఆ తర్వాత కృణాల్ పాండ్య(43; 22 బంతుల్లో 4×4, 2×6) మరింతగా రెచ్చిపోయాడు. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ తో కలిపి మొత్తం 20 పరుగులు రాబట్టాడు. వరుస బాల్స్ లో బదోని(8), రవి బిష్ణోయ్(0) వెనుదిరిగినా కృణాల్ బాదుడు ఆగలేదు. దీంతో లఖ్ నవూ 8 వికెట్లకు 199 రన్స్ చేసింది.