వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు(Governors), రాష్ట్ర ప్రభుత్వాల(State Governments) మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కోర్టులకెక్కుతున్నది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్… ఇలా చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వాలు బిల్లులు పంపడం, వాటిని గవర్నర్లు తిరస్కరించడం వివాదానికి కారణమవుతున్నాయి. ఈ ధోరణి సరికాదంటూ ఇలాంటి వాతావరణం ప్రస్తుతం ఇబ్బందికరంగా తయారైందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న విస్మయం చెందారు.
మేం చెప్పాలా…
గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధుల్ని తాము గుర్తు చేయడం ఆశ్చర్యకరంగా తయారైందని జస్టిస్ బి.వి.నాగరత్న రాష్ట్రాధిపతుల వ్యవస్థపై విమర్శలు(Criticized) చేశారు. నల్సార్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘కోర్టులు-రాజ్యాంగంపై 2023లో సమీక్ష’ సదస్సులో ఆమె ప్రసంగించారు. ‘ప్రస్తుత రోజుల్లో గవర్నర్ల కొత్త ట్రెండ్ చూస్తున్నాం.. వాళ్లకు రాజ్యాంగం కల్పించిన విధుల్ని కోర్టులు గుర్తు చేయడం భ్రాంతి(Embarrassing)కి గురిచేస్తున్నది.. బిల్లుల్ని తొక్కిపెట్టడం సరైన పద్ధతి కాదు.. అని సుప్రీం జస్టిస్ అభిప్రాయపడ్డారు.
నోట్ల రద్దుపైనా…
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు 2023లో కుప్పకూలి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడాన్ని జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. కేవలం గవర్నర్ల వ్యవస్థపైనే కాదు నోట్ల రద్దు(Demonetisation)పైనా విమర్శలు చేశారు. అది నల్లధన రాయుళ్లకే ఉపయోగపడింది తప్ప పేదలకు ఎలాంటి లాభం లేకపోగా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. నోట్ల రద్దుపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జిల బెంచ్ లో జస్టిస్ నాగరత్న ఒకరు. ఆ విధానంపై ఆమె ఒక్కరే వ్యతిరేక తీర్పునిచ్చారు. రాజ్యాంగ హక్కుల్ని రక్షించే విషయంలో 2023లో సుప్రీం వెలువరించిన తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
Good article