సొంతగడ్డ(Own Pitch) ఉప్పల్ స్టేడియంలో హోరెత్తించిన సన్ రైజర్స్ ఆటగాళ్లు(Players) అహ్మదాబాద్ స్టేడియంలో మాత్రం చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి క్లాస్ ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే ఔటవడంతో ముంబయిపై కనిపించిన జోరును గుజరాత్ పై చూపించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. 114 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
క్రీజులో నిలిచేలోపే…
మొదట్నుంచీ గుజరాత్ బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేస్తూనే ఉన్నారు. నూర్ అహ్మద్ తొలి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి ట్రావిస్ హెడ్(19)ను బౌల్డ్ చేశాడు. అంతకుముందు మయాంక్(16)ను ఒమర్జాయ్… ఫామ్ లో ఉన్న అభిషేక్(29; 20 బంతుల్లో 2×4, 2×6)ను మోహిత్ శర్మ… మార్ క్రమ్(17) ను ఉమేశ్ యాదవ్, క్లాసెన్(24)ను రషీద్ ఖాన్ వెనక్కు పంపారు.
మోహిత్ కు మూడు…
ఇలా క్రమం(Continue) తప్పకుండా వికెట్లు పడటంతో హైదరాబాద్ టీమ్ 18.2 ఓవర్లకు 150 మార్క్ దాటింది. షాబాజ్ అహ్మద్(22), అబ్దుల్ సమద్(29 నాటౌట్; 14 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. చివరకు ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీసుకున్నాడు.