అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం తర్వాత దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు(Pilgrims) తరలివస్తూనే ఉన్నారు. రోజుకు రెండు లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకుంటు(Visits)న్నట్లు శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ నుంచి కూడా పెద్దసంఖ్యలో అయోధ్యకు వెళ్లి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని భక్తులకు కేవలం రైలు ప్రయాణమే(Train Fecility) కాకుండా డైరెక్ట్ విమాన సర్వీసుల్ని కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
రేపట్నుంచే…
హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు(Air Services) రేపట్నుంచి(ఏప్రిల్ 2 నుంచి) అందుబాటులోకి వస్తున్నాయి. రోజు విడిచి రోజు(Alternative Days) ఈ విమానాలు నడవనున్నాయి. మంగళ, గురు, శనివారాల్లో ప్రయాణికులు అయోధ్యకు వెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ విమాన సౌకర్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న రాసిన లేఖకు స్పందనగానే విమాన సర్వీసులు మొదలవుతున్నాయని గుర్తు చేశారు.
టైమింగ్స్ ఇలా…
హైదరాబాద్-అయోధ్య మధ్య స్పైస్ జెట్(Spicejet) విమానాలు నడవనున్నాయి. మంగళ, గురు, శనివారాల్లో పొద్దున 10:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్య చేరుకుంటాయి. తిరిగి ఈ రోజుల్లోనే మధ్యాహ్నం 1:25 గంటలకు అయోధ్యలో బయల్దేరి 3:25 గంటలకు గంటలకు హైదరాబాద్ లో విమానాలు దిగనున్నాయి.