ఈ ఐపీఎల్(IPL) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్.. రాజసం ప్రదర్శిస్తున్నది. వరుస(Serial)గా మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టిక(Points Table) టాప్ ప్లేస్ లో ఉంది. ముందుగా ముంబయికి బ్యాటింగ్ అప్పగించి సూపర్(Superb) బౌలింగ్ తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ముంబయి జట్టును 125/9కి పరిమితం చేసిన రాజస్థాన్.. లక్ష్య ఛేదన(Target Reach)లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా పని పూర్తి చేసింది. రియాన్ పరాగ్(54 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 3×6) ధనాధన్ బ్యాటింగ్ తో 15.3 ఓవర్లలో 127/4 చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మూడో మ్యాచ్ లోనూ…
హార్దిక్ సేన మూడో మ్యాచ్ లోనూ అనుకున్నట్లు ఆడలేదు. రోహిత్(0), నమన్ ధిర్(0), డెవాల్డ్ బ్రెవిస్(0) ఖాతా తెరవలేదు. ఇషాన్(16), ఆదుకుంటాడనుకున్న హార్దిక్ పాండ్య(34), పియూష్ చావ్లా(3) ఔటవడంతో సగం ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి 83కే 6 వికెట్లు పోగొట్టుకుంది. తిలక్ వర్మ(32), టిమ్ డేవిడ్(17)ది అదే కథ. బౌల్ట్, చాహల్ మూడేసి చొప్పున, బర్గర్ రెండు వికెట్లు తీసుకున్నారు.
ఛేదనలో…
రాజస్థాన్ తొలి ముగ్గురు బ్యాటర్లు తక్కువ స్కోరుకే ముంబయికి దొరికిపోయారు. జైస్వాల్(10), బట్లర్(13), శాంసన్(12) వికెట్లు కోల్పోగా.. రియాన్ పరాగ్, అశ్విన్ జోడీ కాసేపు నిలబడింది. అశ్విన్(16) వెనుదిరిగినా పెద్ద టార్గెట్ కానందున ఇబ్బందుల్లేకుండానే రాజస్థాన్ గెలుపు దిశగా సాగింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు తీసుకున్నాడు. వరుసగా 3 విజయాలతో 6 పాయింట్లు పొంది రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అటు ముంబయి మూడింటికి మూడు ఓడి చివరి స్థానంలోనే ఉండిపోయింది.