
మోడ్రన్ డిజిటల్ యుగం(Modern Landscape)లో పాస్ వర్డ్(Password)కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆన్ లైన్ అకౌంట్లకు అడ్డుగోడలా ముందుండే పాస్ వర్డ్.. గట్టి(Strong)గా ఉంటేనే శ్రేయస్కరం. గుర్తింపు ఆధారాలు(Identities), ఫైనాన్షియల్ అకౌంట్స్, సున్నితమైన డేటా(Sensitive Data)కు పాస్ వర్డ్ తప్పనిసరి. అలాంటి సెక్యూరిటీ కోడ్ విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆ రిపోర్ట్ ప్రకారం…
ప్రపంచవ్యాప్తంగా కొన్ని పాస్ వర్డ్స్ అత్యంత కామన్ గా వాడుతున్నారని ‘నార్డ్ పాస్(NordPass)’ అనే సంస్థ రిపోర్ట్ తెలిపింది. 21 పాస్ వర్డ్ లు అత్యంత ఈజీగా ఉండటం వల్ల వాటిని సెకన్(Second) వ్యవధిలోనే హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించింది. ఒకవేళ మీరు గనుక ఈ కింది పాస్ వర్డ్ లు పెట్టుకున్నట్లయితే వాటిని వెంటనే మార్చుకోండి.
ఈజీ పాస్ వర్డ్స్ ఇవే…
| 01. | PASSWORD |
| 02. | 123456 |
| 03. | Admin |
| 04. | 12345678 |
| 05. | 123456789 |
| 06. | 1234 |
| 07. | 12345 |
| 08. | password |
| 09. | 123 |
| 10. | Aa123456 |
| 11. | 1234567890 |
| 12. | UNKNOWN |
| 13. | 1234567 |
| 14. | 123123 |
| 15. | 111111 |
| 16. | Password |
| 17. | 12345678910 |
| 18. | 000000 |
| 19. | Admin123 |
| 20. | ******** |
| 21. | user |