కెప్టెన్, ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గిల్ సేన… మొదట్నుంచీ బాగానే ఆడింది. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(11) రబాడ్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్(26), సాయి సుదర్శన్(33; 19 బంతుల్లో 6×4) అండతో గిల్ రెచ్చిపోయాడు.
31 బంతుల్లో…
శుభ్ మన్ 31 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్(85; 45 బంతుల్లో 6×4, 4×6) మరింత రెచ్చిపోయాడు. విజయ్ శంకర్(8) మరోసారి నిరాశపరిస్తే రాహుల్ తెవాతియా(23; 8 బంతుల్లో 3×4, 1×6)తో గిల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ ఇద్దరి బాదుడుతో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లకు 199 స్కోరు చేసింది.
IPLలో గిల్ 19వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. రబాడ 2, హర్షల్ పటేల్, హర్ ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. 10 రన్ రేట్ తో పంజాబ్ 200 పరుగుల టార్గెట్ ను రీచ్ అవ్వాల్సి ఉంది.