హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఉప్పల్ స్టేడియం)లో ఆశ్చర్యకర సంఘటన(Interesting Matter) చోటుచేసుకుంది. ఈ మైదానానికి కరెంటు సరఫరా(Power Supply) కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు. రూ.3.05 కోట్లకు పైగా బాకీ పడ్డ ఛార్జీల్ని చెల్లించడం లేదంటూ నోటీసులు జారీ చేసి మరీ కరెంటు కట్ చేశారు. రూ.1,41,18,269 ఛార్జీతోపాటు రూ.1,63,94,521 సర్ ఛార్జీ చెల్లించాల్సి ఉందన్న ట్రాన్స్ కో.. విద్యుత్ చౌర్యం కింద కేసు నమోదు చేసింది.
బిల్లులు చెల్లించకుండా…
బిల్లులు చెల్లించకుండా వాడుకున్న కరెంటుకు తక్షణమే డబ్బులు చెల్లించాలని, 15 రోజుల్లోపు చెల్లించాలంటూ ఫిబ్రవరి 20నే నోటీసులు ఇచ్చామని హబ్సిగూడ ట్రాన్స్ కో అధికారులు అంటున్నారు. దీనిపై HCA స్పందించకపోవడంతో కరెంట్ సప్లయ్ ని ఆపేశామన్నారు. మరోవైపు ఈ స్టేడియంలో రేపు IPL మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా పూర్తి చేసుకున్నారు.
జనరేటర్లతో…
శుక్రవారం నాడు హైదరాబాద్ సన్ రైజర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. గురువారం నాటి ప్రాక్టీస్ మ్యాచ్ ను జనరేటర్ల మధ్యనే ప్లేయర్లు పూర్తి చేసుకోవడం సంచలనంగా మారింది. ఇలా మ్యాచ్ కు ముందు రోజు ఇంతటి పరిస్థితి తలెత్తడంతో HCA అధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.