డబ్బులు డిపాజిట్ చేయాలంటే బ్యాంకులకు వెళ్లి తీరాల్సిందే. అక్కడ క్యూ ఉండటం, గంటల కొద్దీ వేచి చూసి అలసిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ కష్టాలకు ఇక చెక్ పెట్టాలని భావించింది RBI. యూపీఐ(Unified Payments Interface) సేవల్ని మరింతగా పెంచాలన్న ఉద్దేశంతోపాటు బ్యాంకులపై ప్రత్యక్ష భారం తగ్గించాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
నగదు డిపాజిట్ల(Cash Deposits)ను UPI ద్వారా చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ విషయాన్ని RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ మెషీన్లలో డబ్బులు డిపాజిట్(Cash Deposit Machine) చేసే సౌకర్యం ఉంది.
సులభతరంగా…
కార్డు లేకుండా(Cardless) లావాదేవీలు జరిపేందుకు వీలుగా UPI ద్వారా నగదు డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు RBI గవర్నర్ తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా డిపాజిట్ సౌకర్యం మరింత సులభమవుతుందని, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్(PPI) లింక్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కూడా అనుమతించాలని నిర్ణయించింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ GDP వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చని RBI అంచనా వేసింది.