రాముడు అయోధ్యకు తిరిగివచ్చాడు… ఇక ‘రామ్ నామ్ సత్య(Ram Naam Satya)’నే ఆదర్శం కావాలి… అందుకే ఈ సందేశాన్ని ఉత్తర్ ప్రదేశ్ అంతటా వ్యాపింపజేశాం… ఒకప్పటి భయానక UP ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంతో కనిపిస్తున్నది… మహిళలు స్వేచ్ఛగా రాత్రి పూట భయం లేకుండా తిరుగుతున్నారు… రామ్ నామ్ సత్య గురించి ఎవరికి చేరవేయాల్నో అందరికీ పంపించాం… అంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక కామెంట్స్ చేశారు.
ఎన్నికల ర్యాలీలో…
అలీఘడ్ నుంచి పోటీ చేస్తున్న సతీశ్ గౌతమ్ కోసం ఎన్నికల ప్రచారం(Campaign) నిర్వహించిన యోగి… 2014, 2017 టైమ్ లో క్రిమినల్స్ వల్ల రాష్ట్రానికి రావాలంటేనే వ్యాపారవేత్తలు(Businessmen) భయపడేవారు.. కానీ మేం అధికారం చేపట్టగానే రామనామంతోపాటు అసాంఘిక చర్యలపైనే దృష్టిపెట్టాం.. ఇప్పుడు UPలో మతకల్లోలాలు, అల్లర్లు, కర్ఫ్యూలాంటివి ఎక్కడా లేవని తెలిపారు.
యూపీ అంటేనే…
యూపీ అంటేనే న్యూసెన్స్(Nuisance) తోపాటు హింస(Violence) ఉండేదని, ఇప్పుడది పండుగలకు ప్రధాన కేంద్రంగా మారిందని CM గుర్తు చేశారు. రామ్ ఉత్సవ్, రంగోత్సవ్, దీపావళి, కృష్ణ ఉత్సవ్, దీపోత్సవ్ వంటివన్నీ ఉన్నాయన్నారు. హోలీ పండుగ నాడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బర్సానాలకు 10 లక్షల మంది వస్తున్నారు… 2017కు ముందు 20 నుంచి 25 వేల మంది మాత్రమే హోలీ ఆడేవారు అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.