ప్రస్తుతం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల(Welfare Schemes)కు రూ.70 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వీటిని అమలు చేయడమే కష్టంగా భావిస్తే చంద్రబాబు మాత్రం రూ.1.40 లక్షల కోట్ల మేర హామీలు ఇస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండింతల బడ్జెట్ ను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన ఆయన.. అమలు చేస్తే కదా అంతలా పెట్టాల్సి వస్తుందంటూ విమర్శించారు.
ప్రకాశం సభలో…
చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లేనని ప్రకాశం జిల్లా వెంకటాచలం సభలో జగన్ అన్నారు. నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పింఛన్లకే ఇస్తున్నామంటూ పెన్షనర్లతో నిర్వహించిన ఫేస్ టూ ఫేస్ కార్యక్రమంలో వివరించారు. తాము మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టబోయే సంతకం వలంటీర్ల(Volunteers) వ్యవస్థపైనే అని గుర్తు చేశారు.