మూడోసారి అధికారం(Power)లోకి వస్తామని ఘంటాపథం(Sure)గా చెబుతున్న భారతీయ జనతా పార్టీ(BJP)… పగ్గాలు చేపట్టగానే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు(Action Plan) పూర్తి చేసింది. పీఠం ఎక్కిన తొలి 100 రోజుల్లోపే ఏయే స్కీమ్ లు అమలు చేయాలన్న అంశాలపై ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు(Reports) తెప్పించింది. ముఖ్యంగా పేదలపై ఈసారి ఎక్కువగా దృష్టిపెట్టాలని మోదీ సర్కారు ఆలోచనతో ఉంది. 3 నెలల్లోనే 4 ఎయిర్ పోర్టులు, హైవేలపై ప్రమాదాలు జరిగితే క్యాష్ లెస్(Cashless Transactions) విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది.
భారీగా హోమ్ లోన్స్…
పేదలు తలదాచుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ముఖ్యంగా పట్టణ(Urban) ప్రాంతాల్లో(Areas) నానా అవస్థలు ఎదురవుతుంటాయి. అలాంటి వారి కోసం వడ్డీతో కూడిన సబ్సిడీని అందించేలా ‘గృహ రుణాలు(Home Loans)’ ఇవ్వాలన్న నిర్ణయానికి కమలం పార్టీ వచ్చింది. కొన్ని నెలల చర్చల తర్వాత కేంద్ర హౌజింగ్ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసింది. ‘పట్టణ పేదల జీవనోపాధి మిషన్(Urban Livelihood Mission)’కు సంబంధించిన ప్రకటనను ఆగస్టు 15న మోదీ ప్రకటించబోతున్నారు.
రైల్వేల్లోనూ…
ఇక నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాది మందికి రవాణా కల్పిస్తున్న రైల్వేలపైనే మోదీ సర్కారు దృష్టిపెట్టింది. ప్రయాణికులకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు గాను ‘రైల్ యాత్రి బీమా యోజన’ను తీసుకువస్తున్నది. రూ.11 లక్షల కోట్లతో మూడు ఎకనమిక్ కారిడార్లలో 40,900 కిలోమీటర్ల మేర రైల్వేలను విస్తరించడంతోపాటు జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే.. 24 గంటల ముందు కూడా రిఫండ్ స్కీమ్(Refund Scheme) అందుబాటులోకి తెస్తున్నది.
కొత్త సిస్టమ్ ఇలా…
ప్రస్తుతమున్న విధానం ప్రకారం.. టికెట్లు రద్దు(Cancellation) చేసుకోవాలంటే జర్నీకి 3 రోజుల ముందుగానే రిఫండ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది 24 గంటల లోపునకు మారుస్తూ మోదీ కొత్త సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక సర్వీసులకు సంబంధించి టికెటింగ్, ట్రాకింగ్ వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గాను ‘సూపర్ యాప్(Supre App)’ ప్రవేశపెట్టాలని చూస్తుంది. 320 కి.మీ. స్పీడ్ తో పరుగెత్తే బుల్లెట్ ట్రైన్ ను 508 కి.మీ. దూరం గల అహ్మదాబాద్-ముంబయి కారిడార్ లో 2029 ఏప్రిల్ లోగా తేవాలని భావిస్తున్నది.