ముఖ్యమంత్రి(Chief Minister) అయినా, సామాన్యుడు(Common Man) అయినా న్యాయస్థానానికి ఒక్కటే అని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. CM అయినంత మాత్రాన మీకో న్యాయం, సామాన్యులకో న్యాయం ఉండదని గుర్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ED తనను అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పట్ల అక్కడి హైకోర్టు చేసిన కీలక కామెంట్స్ ఇవి.
అందరికీ ఒకేలా…
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు(Proofs) ఉన్నాయన్న ఢిల్లీ హైకోర్టు… హవాలా ద్వారా డబ్బు తరలించినట్లు రుజువుల్ని ED చూపించిందని స్పష్టం చేసింది. మద్యం విధానం తయారీ, మనీలాండరింగ్ లో ఆప్ కన్వీనర్ పాత్ర ఉందని, ముడుపులు తీసుకోవడంలోనూ అతడి పాత్ర ఉందని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గుర్తు చేశారు. అటు గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు ఇప్పటికే అప్రూవర్ చెప్పినందున.. CM అరెస్టు, రిమాండ్ అనేది చట్టవిరుద్ధం కాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) అభిప్రాయపడింది.
పిటిషన్ కొట్టివేస్తూ…
నిందితుడి వీలును బట్టి విచారణ జరపటం కుదరదు.. CM అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు.. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనక్కర్లేదు.. అంటూ కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసింది. కస్టడీ అంశంపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పడంతోపాటు ఆప్ అధినేత పిటిషన్ పై హైకోర్టు తీవ్రమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది.