పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ దెబ్బకొట్టడంతో హైదరాబాద్ సన్ రైజర్స్(Sunrisers) కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది. మొహాలీలోని ముల్లాన్ పూర్లో పంజాబ్ కింగ్స్ తో(PBKS) జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్.. 39 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ తక్కువ పరుగులు ఇచ్చి మొత్తం నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు ఫెయిలవడంతో భారీ స్కోరు చేయలేకపోయినా చివరకు సన్ రైజర్స్ టీమ్ 9 వికెట్లకు 182 రన్స్ చేసింది.
ముగ్గురు వరుసగా…
ట్రావిస్ హెడ్(21), అభిషేక్ శర్మ(16), మార్ క్రమ్(0) పెద్దగా స్కోరు చేయలేదు. ముగ్గురు టాప్ బ్యాటర్లు ఔట్ కావడంతో హైదరాబాద్ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే సెకండ్ డౌన్లో వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి(64; 37 బంతుల్లో 4×4, 5×6) ఫటాఫట్ బ్యాటింగ్ తో హైదరాబాద్ ఒక్కసారిగా లైన్లోకి వచ్చింది. అటు మరో ఎండ్ లో మాత్రం రాహుల్ త్రిపాఠి(11), క్లాసెన్(9) క్రీజులో నిలబడలేదు.
అయినా అబ్దుల్ సమద్(25; 12 బంతుల్లో 5×4) ఉన్నంతలో స్పీడ్ గా ఆడాడు. ఆరో వికెట్ కు నితీశ్, సమద్ జోడీ 18 బాల్స్ లోనే 50 పార్ట్నర్ షిప్ అందించింది. చివరకు ఈ ఇద్దర్నీ అర్షదీపే పెవిలియన్ దారి పట్టించాడు. 4 ఓవర్లలో 29 రన్సే ఇచ్చి 4 వికెట్లతో హైదరాబాద్ ను అడ్డుకున్నాడు.