మాజీ మంత్రి కె.తారకరామారావు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ‘X, ఇన్ స్టాగ్రామ్’ వేదికల్లో తరచూ(Regular) పోస్టులు పెడుతుంటారు. ప్రశంసించినా, విమర్శలు చేసినా, సహాయం చేయాలన్నా, ఏదైనా పని మొదలుపెట్టినా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. అలాంటి KTR ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ఆ పిక్(Pic)కు సినీ నటి సమంత అందరికంటే ముందుగా(Firstly)గా స్పందించడం, ఎమోజీ జోడించడంతో ఇది కాస్తా వైరల్ అయింది. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారు.. సమంత కామెంట్ ఏమిటి.. అన్నది తెలుసుకోవాలనుందా…!
చిరునవ్వుతో
BRS అధికారం కోల్పోయిన తర్వాత నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు KTR. చుట్టూ జనాలు ఉండగా అందులో చిరునవ్వు చిందిస్తున్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు క్యాప్షన్(Caption) కూడా పెట్టారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అన్నది ఆ కామెంట్. ఈ ఫొటోకు వెంటనే రెస్పాండ్ అయిన సమంత ఫొటోను లైక్ చేయడంతోపాటు ‘నమస్తే’ ఎమోజీని కామెంట్ గా పెట్టారు. దీంతో ఈ కామెంట్ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.