కెప్టెన్ శుభ్ మన్ గిల్ పోరాటానికి తోడు చివర్లో రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ సూపర్ బ్యాటింగ్ తో ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ గెలుపు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ అప్రతిహత(Unstoppable) విజయ యాత్రకు అడ్డుకట్ట వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్(RR) 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆ టార్గెట్ ను చివరి వరుస బ్యాటర్లతో ఛేదించి మరో గెలుపును ఖాతాలో గుజరాత్ వేసుకుంది. 7 వికెట్లకు 199 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
అంతకుముందు…
జైస్వాల్(24), బట్లర్(8) ఫెయిలైనా సంజూ శాంసన్(68 నాటౌట్; 38 బంతుల్లో 7×4, 2×6), రియాన్ పరాగ్(76; 48 బంతుల్లో 3×4, 5×6) జోడీ ఇన్నింగ్స్ ను ముందుకు సాగించింది. తొలుత మెల్ల(Slow)గా ఆడి తర్వాత దూకుడు పెంచింది. పరాగ్ 34 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో ఫిఫ్టీ పూర్తి చేస్తే.. శాంసన్ 31 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 132 పరుగులు జత చేశారు.
తర్వాత…
197 టార్గెట్ తో రంగంలోకి దిగిన గుజరాత్ ను పేస్ బౌలర్ కుల్దీప్ సేన్ బెంబేలెత్తించాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్(35), గిల్(72; 44 బంతుల్లో 6×4, 2×6) తొలి వికెట్ కు అందించిన 64 పరుగుల పార్ట్నర్ షిపే హయ్యెస్ట్. ఆ తర్వాత మాథ్యూ వేడ్(4), అభినవ్ మనోహర్(1), విజయ్ శంకర్(16), షారుక్ ఖాన్(14) క్రమంగా వికెట్లు పోగొట్టుకున్నారు. వేడ్, మనోహర్ ను కుల్దీప్ సేన్ బౌల్డ్ చేసిన తీరు ఆటకే హైలెట్ నిలిచింది. కానీ చివర్లో తెవాతియా(22; 11 బంతుల్లో 3×4), రషీద్(24 నాటౌట్; 11 బంతుల్లో 4×4) పోరాటం చేసి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చారు.
లాస్ట్ ఓవర్లో…
19 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 182/తో ఉంది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన స్థితిలో చివరి ఓవర్లో వరుసగా 4, 2, 4, 1 రన్స్ వచ్చాయి. ఇక 2 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన దశలో ఐదో బంతిని ఆడాడు తెవాతియా. రెండు పరుగులు తీసి థర్డ్ రన్ తీసే టైమ్ లో రనౌట్ అయ్యాడు. దీంతో మిగిలిన చివరి బాల్ కు రెండు పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి ఉత్కంఠకు తెరదించాడు.