పాఠశాల(School) బస్సు బోల్తా పడి ఆరుగురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన హరియాణాలో జరిగింది. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వేగం(High Speed)గా వెళ్తున్న సమయంలోనే డ్రైవర్ మరో వాహనాన్ని(Vehicle) ఓవర్ టేక్ చేయడంతో బస్సు అదుపు తప్పినట్లు అక్కడివారు చెబుతున్నారు. నార్నౌల్ లోని ఉనాని గ్రామ సమీపంలో ఈ ఘోరం జరిగింది.
ఓవర్ టర్న్ వల్లే…
మహేంద్రగఢ్ లోని కనీనా ప్రాంతంలోని జి.ఎల్.పబ్లిక్ స్కూల్ కు చెందిన బస్సు ఉనాని(Unhani) గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. స్పీడ్ తో బోల్తా పడటం వల్ల పిల్లలందరూ దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఆందోళనకు గురైన విద్యార్థుల్లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. సదరు గ్రామంలోని లింక్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు బస్సు ఎక్కిన వెంటనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ఉనాని గ్రామస్థులు అంటున్నారు.