భారత జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో మ్యాజిక్ చేశాడు. 5 వికెట్లతో అతడు తీసిన దెబ్బకు ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ మరింత ఎక్కువగా స్కోరు చేయలేకపోయింది. అయినా ముగ్గురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలతో బెంగళూరు మంచి స్కోరే చేసింది.
ఆ ముగ్గురు…
ఫెఫ్ డుప్లెసిస్(61; 40 బంతుల్లో 4×4, 3×6), రజత్ పటీదార్(50; 26 బంతుల్లో 3×4, 4×6), దినేశ్ కార్తీక్(53; 23 బంతుల్లో 5×4, 4×6) ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించారు. చివర్లో కార్తీక్ దంచికొట్టడంతో బెంగళూరు 8 వికెట్లకు 196 రన్స్ చేసింది. ఫటాఫట్ హాఫ్ సెంచరీలతో పటీదార్, డుప్లెసిస్, కార్తీక్ RCBని మంచి స్థితిలో నిలిపారు. కార్తీక్ 22 బంతుల్లో, పటీదార్ 25 బాల్స్ లో, డుప్లెసిస్ 33 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ ను దాటారు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి బుమ్రా కీలక ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.