ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ‘షాన్ దార్’ ఇన్నింగ్స్ తో ముంబయి బ్యాటింగ్ చకచకా సాగింది. అతడు కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడితే ఇషాన్ తుపాన్ లా విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మూడు సిక్స్ లతో 23 పరుగులు రాబట్టాడు. బెంగళూరు విసిరిన 197 టార్గెట్ ను ఛేదించేందుకు ముంబయి ఓపెనర్లు దూకుడుగా ఆడారు.
12 రన్ రేట్ పైనే…
ఈ లెఫ్ట్ హ్యాండర్ ధనాధన్ ఆటతీరుతో ముంబయి స్కోరు 12 రన్ రేట్(Run Rate)కు పైగా నడిచింది. మూడో ఓవర్ నుంచి మొదలైంది ఇషాన్(69; 34 బంతుల్లో 7×4, 5×6) విధ్వంసం. ఆ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అతడు.. ఐదో ఓవర్లో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టాడు. సిరాజ్ వేసిన ఈ ఓవర్లో(Expensive Over) రోహిత్ సైతం ఇంకో సిక్సర్ బాదడంతో 23 రన్స్ వచ్చాయి. కిషన్-రోహిత్ జోడీ ఫస్ట్ వికెట్ కు 101 రన్స్ పార్ట్నర్ షిప్ ఇచ్చింది.