అరంగేట్ర(Debut) మ్యాచ్ లోనే జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్(Jake Fraser McGurk) అర్థ సెంచరీతో అదరగొట్టడంతో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తొలి IPL మ్యాచ్ ఆడుతున్నానన్న బెరుకే లేకుండా బ్యాటింగ్ సాగించాడు ఫ్రేజర్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG) తొలుత 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ జట్టులో…
డికాక్(19), రాహుల్(39), పడిక్కల్(3), మార్కస్ స్టాయినిస్(8), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(10), కృణాల్ పాండ్య(3) స్కోరు చేశారు. బదోని(55 నాటౌట్; 35 బంతుల్లో 5×4, 1×6) మాత్రం చివరిదాకా పట్టు విడవకుండా తమ టీమ్ ను మంచి స్థాయిలో ఉంచే ప్రయత్నం చేశాడు. చివర్లో అర్షద్ ఖాన్(20)తో కలిసి దూకుడుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో లఖ్ నవూ 167 పరుగుల వద్ద ముగించింది.
ఫ్రేజర్, పంత్…
ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీషా(32; 22 బంతుల్లో 6×4) నిలబడ్డా మరో ఓపెనర్ వార్నర్(8) తొందరగానే ముగించాడు. అప్పుడు మొదలైంది కొత్త కుర్రాడి ధనాధన్. ఫ్రేజర్(55 నాటౌట్; 35 బంతుల్లో 2×4, 5×6), రిషభ్ పంత్(41 నాటౌట్; 24 బంతుల్లో 4×4, 2×6) ఉన్నంతసేపు దడదడలాడించారు. మూడో వికెట్ కు ఈ ఇద్దరూ 77 పరుగుల పార్ట్నర్ షిప్ అందించడంతో స్కోరు చకచకా పెరిగింది. చివర్లో ఈ ఇద్దరూ ఔటైనా ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్ ఆటను ముగించారు. వరుస ఓటములతో అట్టడుగు స్థానానికి చేరుకున్న ఢిల్లీ.. ఈ గెలుపుతో పరువు నిలుపుకొంది.