కోల్ కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న మ్యాచ్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG) తక్కువ స్కోరుకే పరిమితమైంది. KKR బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టంగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లఖ్ నవూ టీమ్ లో ఏ ఒక్కరూ గట్టిగా నిలబడలేదు. దీంతో 7 వికెట్లకు 161 పరుగుల వద్దే ఆగిపోయింది.
బ్యాటింగ్ ఇలా…
క్వింటన్ డికాక్(10) మరోసారి ఫెయిల్ కాగా, కెప్టెన్ కేఎల్ రాహుల్(39) కొద్దిసేపు బాగానే బౌలర్లను అడ్డుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన దీపక్ హుడా(8), మార్కస్ స్టాయినిస్(10) ఆడకుండానే ఔటయ్యారు. కానీ ఆయుష్ బదోని(29), నికోలస్ పూరన్(45; 32 బంతుల్లో 2×4, 4×6) మాత్రం కోల్ కతా బౌలర్లను ప్రతిఘటించారు. 13.1 ఓవర్లలో 100 మార్క్ ను చేరుకుంది లఖ్ నవూ. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసుకున్నాడు.