
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 50వ చిత్రంపై ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహించనుండగా.. సన్ పిక్చర్స్ నిర్మించనుంది. D50 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. టాలీవుడ్ యువ నటుడు ఒకరు ఇందులో ప్రముఖ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఇక ధనుష్ విషయానికొస్తే.. ఇటీవలే ‘సార్’ మూవీతో తెలుగులో మొదటిసారి స్ట్రెయిట్ మూవీలో నటించారు. అలాగే హిందీలోనూ ఇప్పటికే రెండు సినిమాలు చేసినందున అక్కడ కూడా తనకు మంచి మార్కెట్ ఉంది. ఇవన్నీ ధనుష్50 చిత్రానికి ఉపయోగపడనున్నాయి. ఇక ఈ చిత్ర కథలో ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినదని తెలుస్తోంది. బ్రదర్స్‌గా ధనుష్‌తో పాటు ఎస్జే సూర్య, విష్ణు విశాల్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, ధనుష్‌కు డైరెక్టర్‌గా ఇది రెండో ప్రాజెక్ట్. ఇంతకుముందు తను ‘పా పాండి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కామిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కగా.. ప్రస్తుతం D50వ చిత్రం మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. దీని తర్వాత ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.