బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముఠాను ఇప్పటికే గుర్తించిన పోలీసులు… ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబయి బాంద్రా(Bandra)లోని గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద నాలుగు షెల్స్ తోపాటు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ అదే ఇంట్లో ఉన్నారు. అయితే ఈ ఘటనతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధం ఉందని పోలీసులు భావించి దర్యాప్తు చేశారు.
సల్మాన్ కుటుంబం నివాసముండే 8 అంతస్తులు గల గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద CC ఫుటేజ్ సహా కీలక ఆధారాల్ని పోలీసులు సేకరించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ తోపాటు ఢిల్లీ పోలీసులు ఈ కేసుపై దృష్టిపెట్టి ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పనేనన్న నిర్ధారణకు రాగా… ఫేస్బుక్ లో ఈ ముఠా పెట్టిన పోస్టును గుర్తించారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ గా గుర్తించి వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈనెల 14న ఈ బాలీవుడ్ నటుడి ఇంటి వద్ద నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇద్దరు వ్యక్తులు బైక్ ను దొంగిలించి సల్మాన్ ఇంటికి చేరుకున్నారు.