మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ‘భోళా శంకర్’ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయిక కాగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుండగా.. ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు రెస్ట్ తీసుకుంటున్నారు చిరు. అయితే ఈ గ్యాప్‌లోనే ఆయన వారం రోజుల పాటు అమెరికాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీ కోసం కొత్త లుక్‌ని ట్రై చేస్తున్నారని, ఆ లుక్ టెస్ట్ కోసమే న్యూయార్క్ వెళ్తు్న్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ‘బంగార్రాజు’ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చారని తెలుస్తుండగా.. ఆ సినిమా కోసమే ఈ టెస్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అంతేకాదు ఈ మూవీ మలయాళ హిట్ ‘బ్రో డాడీ’కి రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనీపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ ఇవన్నీ పుకార్లుగా కొట్టిపారేస్తున్నారు చిరు సన్నిహితులు. చిరు తన భార్య సురేఖతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసమే యుఎస్ వెళ్తున్నారని చెప్తున్నారు. మరి చిరు అమెరికాకు ఎందుకు వెళ్తున్నారో తెలియాలంటే అఫిషియల్ అప్డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే.