మేష రాశి
ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారి లేదా ఇంటి పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రతి క్లిష్టమైన పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికాభివృద్ధి మెరుగు పడుతుంది. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడికి గురవుతారు. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న గొడవలు ఈరోజు సమసిపోతాయి. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ఆర్ధిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి
ఈరాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. మీ మనసు సామాజిక సేవ వైపు మొగ్గు చూపుతుంది. విద్యార్థులు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ కీర్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశముంది. ఎప్పటి నుంచో వసూలు కానీ బాకీలు ఈ రోజు వసూలవుతాయి. వ్యాపారస్తులు అవసరమైన కొన్ని కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.
మిథున రాశి
ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. తెలియని విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భాగస్వాముల మద్దతు, సహకారముంటుంది. మీరు మీ పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి మాటలను అర్థం చేసుకోవాలి, లేకుంటే గొడవలు వచ్చే అవకాశముంది. ఈ రోజు, మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సహనంతో ఉండాలి, లేకుంటే సమస్యలు చుట్టూ ముడతాయి. ఈ రోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీరు ఈ రోజు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏదైనా పథకం, ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది, కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. ఇంతకు ముందు ఇచ్చిన అప్పులు మీకు రోజు తిరిగి ఇస్తారు. బద్ధకాన్ని విడిచిపెట్టి పనులను తొందరగా పూర్తి చేయండి. తల్లితో వాగ్వాదాలు పెట్టుకోకండి.
సింహ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అపరిచితులకి దూరంగా ఉండండి లేదంటే వారి వల్ల మీ మానసిక స్థితి దిగజారిపోవచ్చు. మీరు కొన్ని కొత్త వ్యాపార ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు మీ శక్తిని సరైన పనులకి ఉపయోగించండి లేకుంటే సమస్య ఉండవచ్చు. మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. మీ మనస్సు దేని గురించో ఆందోళన చెందుతుంది. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు.
కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పదోన్నతి పొందే అవకాశముంది. మీ ఆదాయం, వ్యాపారం, ఇతర పరిశ్రమల్లో ఉన్నవారికి గణనీయమైన పెరుగుదల ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే వివాదాలు వచ్చే అవకాశముంది. వాటిని వెంటనే పరిష్కరించుకోండి. ఈరోజు మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ప్రయాణంలో మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. మీ పిల్లల నుంచి మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి.
తులా రాశి
ఆఫీసు సంబంధిత పనుల కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఏ పనినైనా చేయగల మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అధిక పనిభారం కారణంగా, మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు కొన్ని కొత్త ప్రణాళికలు వేసుకునే రోజు. మీరు మీ శక్తిని సరైన పనికోసం వినియోగిస్తే అది మీకే మంచిది. ఈ రోజు, మీ ప్రత్యర్థుల మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు, కుట్రలు పన్నవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు. మీ ప్రసంగం లో ఉన్న సౌమ్యత ఈ రోజు మీకు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ రోజు అనుకూలంగా లేనందున విరమించుకోవటం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువులు ఇంటికి వస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. ఈ రాశి విద్యార్థులు పరీక్షల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఉన్నతాధికారుల సలహా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఈ రోజు ఆస్తి వివాదంలో మీరు విజయం సాధిస్తారు. మీరు మీ తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం యాత్రలకు వెళ్లే అవకాశముంది. మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజు సంతోషంతో ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మెరుగైన అవకాశాలుంటాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాల కారణంగా మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఆదాయం పెరగడానికి బలమైన సంకేతాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు మంచి రోజు. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో అప్రమత్తంగా ఉండండి.
మకర రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల మీరు టెన్షన్‌గా ఉంటారు. డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదం జరగవచ్చు. మీరు దూరపు బంధువు నుంచి కొంత నిరాశాజనకమైన సమాచారాన్ని వినాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల కారణంగా ఆందోళనలో ఉంటారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.
కుంభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు మీ సామర్థ్యం మేరకు పనిని సులభంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక లాభం గణనీయంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు ఏదైనా బ్యాంకు, వ్యక్తి, సంస్థ నుంచి డబ్బు తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించే అవకాశముంది. మీరు ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వొద్దు. కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. తల్లిదండ్రుల సహాయంతో మీరు మీ పిల్లలకు సంబంధించిన సమస్యను పరిష్కరించవచ్చు.
మీన రాశి
పనిలో ఎదురైన ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా వేగంగా ముందుకు సాగండి. కొంచెం తెలివిగా ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. దగ్గరి బంధువుల నుంచి బకాయి మొత్తాన్ని రికవరీ చేసే అవకాశముంది. ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన రోజు. మీకు సమస్య వచ్చి దానిని నిర్లక్ష్యం చేస్తే, అది తరువాత పెద్ద వ్యాధిగా మారుతుంది. ఉద్యోగస్తులు తోటి సహోద్యోగుల సహాయంతో పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలోని పిల్లలతో సరదాగా గడుపుతారు. మీకు మీ తోబుట్టువులతో వాగ్వాదం జరిగే అవకాశముంది.
రాళ్లపల్లి సరస్వతీదేవి