అయోధ్యలో కొలువైన శ్రీరాముడి చెంతన అద్భుతం(Miracle) ఆవిష్క్రృతమైంది. నవమి వేళ స్వామి నుదుటన సూర్య తిలకం దిద్దుకుంది. రాముడికి నామంగా సూర్యకిరణాలు(Sun Rays) ప్రసరించాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి కిరణాలు స్వామి వారిని తాకేలా ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఘట్టాన్ని వీక్షించిన భక్తులు పరవశానికి గురయ్యారు.
గర్భగుడిలోని రాముడి విగ్రహం(Idol’s) నుదుటి(Forehead)పై తిలకం మాదిరిగా కిరణాలు 58 మిల్లీమీటర్ల పరిణామంలో కొన్ని నిమిషాల పాటు సూర్య అభిషేకం తరహాలో ప్రసరించాయి. మధ్యాహ్నం 12:04 గంటలకు మూడున్నర నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. మరోవైపు అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.