శ్రీరామచంద్రుడితో వేలు పట్టి నడిచిన సీతమ్మ తల్లికి పెళ్లి కానుకగా అపురూప కానుకను బహూకరించాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు. పచ్చల హారాలు, ముత్యాల తలంబ్రాలే కాదు.. రంగులు మారే(Colour Changing) బంగారు చీరను ధరించనున్నారు సీతమ్మ తల్లి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ కళాకారుడు.. చేనేత మగ్గంపై నేసిన బంగారు చీర(Gold Saree)ను అందజేశాడు.
గత ఘనతలు…
అగ్గిపెట్టెల్లో చీరలు నేయడం, దబ్బనంలో పట్టే వస్త్రాల్ని తయారు చేసిన నల్ల పరంధాములు అనే చేనేతన్న.. అద్భుత కళాకారుడి(Handloom Artist)గా గుర్తింపు తెచ్చుకున్నారు. కుట్టు లేని కుర్తా పైజమా.. అరటి నారతో విభిన్నమైన వస్త్రాలు నేసి ‘చేనేత కళారత్న’ అవార్డు అందుకున్నారు. ఇప్పుడాయన తనయుడు విజయ్.. భద్రాచల రాములోరికి బంగారు చీరను నేసి తండ్రి వారసత్వంగా వచ్చిన కళను రెట్టింపు చేశాడు. మగ్గంపై ప్రయోగాలు చేయడం తండ్రి నుంచే నేర్చుకున్నారు విజయ్.
వినూత్నంగా…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయ్.. వినూత్న(Variety) రీతిలో బంగారు చీరను నేశాడు. రంగులు మార్చుకునే స్వర్ణకాంతుల చీరను అందజేసి పలువురితో అభినందనలు అందుకున్నాడు.