ఆరు మ్యాచుల్లో నాలుగు ఓడి అట్టడుగు(Last) స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(DC).. కీలక సమయంలో భారీ విజయాన్ని దక్కించుకుంది. తొలుత గుజరాత్ ను 89 పరుగులకే ఆలౌట్ చేసి.. తర్వాత వేగంగా టార్గెట్(Target)ను రీచ్ అయింది. సగం ఓవర్లు పూర్తి కాకుండానే మ్యాచ్ ను ముగించింది. 8.5 ఓవర్లలో 92 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.
GT బ్యాటింగ్…
ఓపెనర్లు సాహా(2), గిల్(8), సుదర్శన్(12), మిల్లర్(2), మనోహర్(8), షారుక్(0), తెవాతియా(10), మోహిత్ శర్మ(4) రషీద్ ఖాన్(31) పరుగులు చేశారు. ముకేశ్ మూడు… ఇషాంత్, స్టబ్స్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.
ఢిల్లీ జోరు…
తొలి ఓవర్లలోనే 14 రన్స్ వచ్చాయి ఢిల్లీకి. జేక్ ఫ్రేజర్(20) ఉన్నంతసేపు బాదగా, పృథ్వీషా(7) తొందరగానే ఔటయ్యాడు. అభిషేక్ పోరెల్(15), షాయ్ హోప్(19) కూడా వికెట్లు ఇచ్చుకున్నారు. మిగతా లాంఛనాన్ని పంత్ పూర్తి చేశాడు.