సూర్యకుమార్ యాదవ్(SKY) మరోసారి తన ఫామ్ తో ముంబయిని మంచి స్థితి(Good Position)లో నిలిపాడు. 34 బాల్స్ లో హాఫ్ సెంచరీ(Fifty) పూర్తి చేసుకున్న అతడు ఆడినంతసేపు హోరెత్తించాడు. టాస్ గెలిచి ముంబయి ఇండియన్స్(MI)కి బ్యాటింగ్ అప్పగించిన పంజాబ్ కింగ్స్(PBKS).. ఓపెనర్లిద్దరినీ తొందరగానే ఔట్ చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది ముంబయి.
సూర్య దూకుడు…
ఇషాన్ కిషన్(8) రబాడ బౌలింగ్ లో క్యాచ్ ఇస్తే రోహిత్ శర్మ(36; 25 బంతుల్లో 2×4, 3×6) ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య(78; 53 బంతుల్లో 7×4, 3×6) తిలక్ వర్మతో కలిసి తమ జట్టును గట్టెక్కించాడు. దూకుడు మీదున్న రోహిత్, సూర్యను ఔట్ చేసిన శామ్ కరణ్.. ముంబయికి ముకుతాడు వేశాడు.
అటు హార్దిక్ పాండ్య(10) భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్య, హార్దిక్ ఇద్దరూ కొద్ది రన్స్ తేడాతో ఔటవడంతో ఆ ప్రభావం ముంబయి స్కోరుపై పడింది. కానీ తిలక్ వర్మ(34; 18 బంతుల్లో 2×4, 2×6), టిమ్ డేవిడ్(14) కొద్దిసేపు పంజాబ్ బౌలర్లను అడ్డుకున్నారు. శామ్ కరణ్, హర్షల్ పటేల్ కీలక సమయంలో చెరో రెండు వికెట్లతో తీసిన దెబ్బకు కష్టాల్లో పడ్డ ముంబయి చివరకు నిలబడింది.