ప్రపంచవ్యాప్తం(Worldwide)గా కంపెనీలను విస్తరిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్న ‘టాటా గ్రూప్’.. మరో బిగ్ డీల్ కోసం రెడీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. భారత్ లోని ‘పెగాట్రాన్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలోని ఐఫోన్ తయారీలో మెజారిటీ వాటా(Majority Share) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. ‘బ్లూమ్ బర్గ్(Bloomberg)’ నివేదిక ప్రకారం భారతదేశంలోని ప్యాకెట్ రన్ కార్పొరేషన్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా నియంత్రించడానికి డీల్(Deal)ను సాధించే అవకాశామున్నట్లు తెలిపింది.
మే లోగా…
వచ్చే నెలలోగానే ‘పెగాట్రాన్ కార్పొరేషన్’ను టేకోవర్ చేసే అవకాశాలున్నట్లు ‘బ్లూమ్ బర్గ్’ అంచనా వేసింది. అదే జరిగితే ఒక దేశానికి సంబంధించిన ఆపిల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో ఇదే పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. భారత అగ్రగామి కంపెనీ అయిన ‘టాటా గ్రూప్’కు ఇది దక్కడం మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ గా చెబుతున్నారు. పెగాట్రాన్ ఆపరేషన్స్ విషయంలో ‘టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ ఇప్పటికే చర్చల్ని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చింది.
అక్కడే ప్లాంట్స్…
ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ఐఫోన్ల తయారీ ప్లాంట్స్ ను చెన్నై లేదా దాని పరిసర ప్రాంతాల్లోనే పెట్టబోతున్నారు. అయితే ఈ కొనుగోలు పట్ల టాటా గ్రూప్ తాము ఆశించిన రీతిలో వ్యవహరిస్తుందని అటు పెటాగ్రాన్ కార్పొరేషన్ సైతం ఆశలు పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ని అందిపుచ్చుకుంటూ భారత్ లో ఐఫోన్ల(iPhone)ల ఉత్పత్తిని మరింత విస్తృతం చేయాలని ఐఫోన్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇప్పటికే చైనా ప్రభుత్వ వైఖరితో అక్కడ ప్రొడక్షన్ ను భారీగా తగ్గించిన ‘ఆపిల్’.. నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలతో అందుకు ప్రత్యామ్నాయం(Alternative)గా భారత్ వైపు చూస్తున్నది.
కేవలం భారత్ కే కాదు…
భారత్ లో ప్రొడక్షన్ వల్ల మన దేశానికే కాకుండా గ్లోబల్ మార్కెట్లోనూ గణనీయ పురోగతి సాధించవచ్చని ఆపిల్ భావిస్తున్నదట. రాబోయే సంవత్సరాల్లో చైనాను మించి ఆర్థిక వృద్ధి సాధించనున్న భారత్ తోనే ఐఫోన్ల మార్కెట్ లోనూ పెద్దయెత్తున మార్పులు ఉంటాయన్న ఆలోచనతో ఉంది. తైవాన్ విస్ట్రాన్ కంపెనీ నుంచి కర్ణాటకలోని ఐఫోన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడం ద్వారా మొట్టమొదటి అసెంబ్లర్(Assembler)గా మారిన టాటా గ్రూప్… ఇప్పుడీ ప్రొడక్షన్ ప్లాంట్ విషయంలో ముందడుగు పడితే ఆపిల్ విషయంలో టాటా గ్రూప్ దే మెజారిటీ వాటా అవుతుంది.