రాహుల్ గాంధీ(Rahul Gandhi)తోనే దేశంలో రామ పాలన ఉంటుందని, ప్రధాని మోదీ(Modi)కి ఆయనతో పోలికే లేదని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. మోదీ గతంలో ఒక సీల్డ్ కవర్ CM అని, అలాంటి సీల్డ్ కవర్ CMలను ఎంతోమందిని డిసైడ్ చేసిన వ్యక్తి రాహుల్ అని కామెంట్ చేశారు. ‘రామాలయ నిర్మాణంతో సమస్యలన్నీ పోయాయా.. శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే.. దేశ రాజకీయాలు మోదీ, రాహుల్ చుట్టే తిరుగుతున్నాయ్.. తన రథయాత్ర పూర్తయ్యాక గుజరాత్ లో BJP గెలిచిన దృష్ట్యా సీల్డ్ కవర్ లో మోదీని CMగా అద్వాణి ప్రకటించారు’ అని గుర్తు చేశారు.
మీడియా మేనేజర్…
ప్రధాని మోదీని సోషల్ మీడియా మేనేజర్ గా అభివర్ణించారు జగ్గారెడ్డి. ‘కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ వీళ్లంతా రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్ అనక తప్పదు.. పవర్ కోసం వచ్చిన లీడర్ మోదీ.. అలాంటి వ్యక్తిని నమ్ముకుని రాహుల్ పై వీళ్లంతా విమర్శలు చేస్తున్నారు..’ అంటూ ఈ మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు.