కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ, శివమ్ దూబె పించ్ హిట్టింగ్(Hitting) హాఫ్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్(CSK) సొంతగడ్డపై మెరిసింది. లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG)తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఇద్దరి దూకుడుతో చెన్నై భారీ స్కోరు చేసింది. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ తో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది.
ఆ ఇద్దరితోనే…
రహానె(1) చెన్నై స్కోరు 4 వద్దనే ఔటైనా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(108; 60 బంతుల్లో 12×4, 3×6) చివరిదాకా క్రీజులో ఉన్నాడు. మధ్యలో డారిల్ మిచెల్(11), రవీంద్ర జడేజా(17) త్వరత్వరగానే వికెట్లు అప్పగించేసుకున్నారు. సిక్స్ లు బాదకున్నా, ధనాధన్ బ్యాటింగ్ చేయకున్నా కానీ రుతురాజ్ సంయమనం(Restrain)తో ఇన్నింగ్స్ ను నడిపించాడు. మరోవైపు గైక్వాడ్ కు భిన్నంగా శివమ్ దూబె సిక్స్ లతో మోతెక్కించాడు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్…
28 బాల్స్ లో 50 పూర్తిచేసిన రుతురాజ్ 100 చేరుకోవడానికి మరో 28 బంతులే ఆడాడు. అటు దూబె కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. చివరకు దూబె(66; 27 బంతుల్లో 3×4, 7×6) ఔటైనా కెప్టెన్ మాత్రం నాటౌట్ గా మిగిలిపోయాడు.