నిబంధనలు(Rules) పాటించని మరో బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆంక్షలు విధించింది. ఇక నుంచి సదరు బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డుల్ని(Credit Cards) తక్షణం నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చింది. ఇలా కొటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధిస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్(Online), మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాదారుల్ని చేర్చుకోవడం కానీ, క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానీ చేయొద్దంటూ ఆంక్షలు విధించింది.
నిలిపివేత…
ఖాతాదారుల(Account Holders)కు జారీ చేసే కొత్త క్రెడిట్ కార్డుల్ని తక్షణమే నిలిపివేయాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు RBI స్పష్టం చేసింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలైన 2022, 23కు సంబంధించిన ఐటీ తనిఖీల్లో అవకతవకలు గుర్తించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. తమ ఆదేశాలు పాటించడంలో ఆ బ్యాంకు పూర్తిగా ఫెయిలందని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఉన్న ఖాతాదారుల లావాదేవీల్ని యథావిధిగా నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 35A ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
కారణాలివే…
పత్రాలు, ఖాతాదారుడి లావాదేవాల నిర్వహణ, డేటా లీక్, డేటా సెక్యూరిటీ, బిజినెస్ కంటిన్యుటీ, డిజాస్టర్ రికవరీ వంటి అంశాల్లో కొటక్ మహీంద్రా పూర్తి నిర్లక్ష్యంగా ఉందని కేంద్ర IT డిపార్ట్మెంట్ గుర్తించి RBIకి రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై ఆ రెండు సంవత్సరాల డేటాకు సంబంధించి సదరు బ్యాంకుతో RBI విస్తృత సంప్రదింపులు(High Level Engagement) జరిపింది. అయినా డిజిటల్ లావాదేవీల్లో ఎలాంటి మార్పూ కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.