త్రేతాయుగంలో పుట్టిన రాముడిని తామే రక్షిస్తున్నట్లు BJP రాజకీయం చేస్తున్నదని మాజీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని KCR పునర్నిర్మించినా(Re-Construction) ఎక్కడా మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయలేదన్నారు. పెద్దన్నగా పిలుచుకునే నరేంద్ర మోదీ 2014లో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ అందులో ఏవీ అమలు చేయలేదని KTR విమర్శించారు.
ఆయన మాటల్లోనే…
‘త్రేతాయుగంలో పుట్టిన రాముణ్ని 1980లో పుట్టిన BJP రక్షిస్తున్నదా.. యుగయుగాలుగా రామచంద్రుణ్ని అందరూ పూజిస్తూనే ఉన్నారు.. దేవుడిని పూజించడం కమలం పార్టీ వాళ్లే నేర్పినట్లు మాట్లాడుతున్నారు.. ఈ ఎన్నికల్లో 10, 12 MPలు అప్పజెప్పుండ్రి, KCR మళ్లీ తిరిగివస్తారు, అప్పుడేంటో చూపిస్తారు.. ఇది కూడా మంచిదే, చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తది.. అని అన్నారు.